మారుమూల
ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ బ్లాక్ ఆస్పిరేషనల్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేశారు. దేశవ్యాప్తంగా 426 ఆస్పిరేషనల్ బ్లాకుల్లో అమలు చే యగా జిల్లాలోని గిరిజనులు అత్యధికంగా ఉన్న నార్నూర్‌ను ఎంపిక చేశారు. ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆ బ్లాక్‌లో ఆరో గ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. ఆ సంస్థ గైడ్‌లైన్స్‌ను పక్కాగా పాటిస్తూ నార్నూర్ పలు రంగాల్లో ప్రగతి సాధించేలా చొరవ చూపారు. వాటిపై పలు విడతల్లో మదింపు చేసిన నీతి ఆయోగ్ అధికారులు ఐదు ప్రధాన అంశాల్లో సాధించిన సమగ్ర అభివృద్ధికి గాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ప్ర జాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి కలెక్టర్ ఎంపికయ్యారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుని జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.


