ఆదిలాబాద్: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుధవారం ఆదిలాబాద్ డిపో మేనేజర్ కార్యాలయంలో పథకానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ, భక్తులు సమీపంలోని ఆర్టీసీ లా జిస్టిక్స్ కౌంటర్ల ద్వారా కానీ www.tgsrt clogistics.co.in వెబ్‌సైట్ ద్వారా కేవలం రూ.151లు చెల్లించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 91542 98531, 91542 98533, 91542 985 53 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


