ఎఫెక్ట్..
కైలాస్‌నగర్: గృహవసర వంట గ్యా స్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఓ మెకానిక్ గ్యారేజీలో ఆటోలకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 1న ‘రీఫిల్లింగ్ దందా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్ రాజర్షి షా ఈ అక్రమదందాపై విచారణకు ఆదేశించారు. దీంతో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ బూస మహేశ్ ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌లోగల మెకాని క్‌షాపును గురువారం సందర్శించారు. అక్కడి పరి స్థితులను స్వయంగా పరిశీలించి వంటగ్యాస్‌ను అ క్రమంగా ఆటోల్లో రీఫిల్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించా రు. బాధ్యులైన మెకానిక్ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు నివేది క అందజేశారు. అయితే, పౌరసరఫరాల శాఖ జిల్లా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే సాగుతున్న ఈ దందా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ విషయాన్ని గతంలో మాదిరి ‘మామూలు’గా తీసుకుంటారా? లేదా.. అక్రమంపై కొరడా ఝులిపిస్తారా? అనేది వేచి చూడాలి.


