ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

నేరడిగొండ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని శ్రీ శివానంద భారతి స్వామిజీ అన్నారు. మండలంలోని తేజాపూర్‌లో ఆదివా రం నిర్వహించిన సాధు సమ్మేళనం, వేదాంత విజ్ఞాన మహాసభల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మిక జీవనం మనిషికి శాంతితో పాటు ఆనందాన్ని ఇస్తుందన్నారు. దేవునిపై విశ్వాసం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం సహకారం, స్నేహభావం కలిగి ఉండాలన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం కూడా ఒక విధమైన భక్తి అని వివరించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, ఆధ్యాత్మిక గు రువులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement