కై లాస్‌నగర్(బేల): బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పూర్తిగా గాడితప్పింది. సంబంఽధిత అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తమ ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయాధికారి కార్యాలయాలను సంప్రదించగా ఉద్యోగులెవరూ లేక ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతినిత్యం ఇదే పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఉద్యోగులు, సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12.30 తర్వాత తీరిగ్గా హాజరయ్యే ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి ఇంటిముఖం పడుతారని అక్కడి సిబ్బంది చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.
ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీగా పర్యవేక్షకుడి కుర్చీ
ఖాళీగా ఉన్న నాయబ్ తహసీల్దార్ సీటు


