ఆదిలాబాద్‌టౌన్: గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టా రు. జిల్లాకేంద్రంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలి పారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద రహదారి పై బైఠాయించి నినా దాలు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లే శ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే గ్యాస్ ధర పెరుగుతుందని ఆరోపించారు. గృహ వినియోగ గ్యాస్‌పై రూ.60, కమర్షియల్ గ్యాస్‌పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి దత్తాత్రి, పూసం సచిన్, ఆర్.సురేందర్, ఆర్. మంజుల, ఆరిఫా, రాధా, గంగారాం, రాములు పాల్గొన్నారు.


