నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పించేందుకు ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పదిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్ మార్కులకు అదనంగా డిప్రైవేషన్ స్కోర్‌ను జోడించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను టీజీ ఆన్‌లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు లేదా https:// www. rgukt. ac.in/ÌZలో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని అధికా రులు తెలిపారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శ న్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కోకన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేశ్, డా. విఠ ల్, డా. దేవరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు.


