ఎస్పీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు..
ఆపరేషన్ ఛబుత్రా, మెసేజ్ యువర్ ఎస్పీ, గ్రామాల్లో వీపీవో విధానం, పోలీస్ అక్క,
రౌడీమేళా, మైనర్ డ్రైవింగ్‌పై కౌన్సెలింగ్, అభయ మై టాక్సీ ఇస్ సేఫ్, ఖాకి కిడ్స్
జిల్లా పోలీసు బాస్‌గా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కానుంది. 12 నెలల వ్యవధిలో తనకంటూ ప్రత్యేకత చాటుతున్నారు ఎస్పీ. అక్రమార్కుల భరతం పట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బ్లాక్ మెయిల్, అక్రమదందాలకు చెక్ పెడుతున్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించకుండా ఊచలు
లెక్కించేలా ముందుకు సాగుతున్నారు. అలాగే మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చే బాధితులకు అండగా ఉంటూ సత్వర న్యాయం అందేలా చొరవ చూపుతున్నారు. – ఆదిలాబాద్‌టౌన్
అఖిల్ మహాజన్, ఎస్పీ


