ఆదిలాబాద్‌టౌన్: పట్టణాన్ని మరింత సురక్షితంగా, నేర రహితంగా మార్చేందుకు సీసీ టీవీ కెమెరాల ఏ ర్పాటు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని 27 వ్యాపార సంఘాల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పా టు ద్వారా నేరాలను ముందుగానే నిరోధించవచ్చన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలి పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు సునీల్‌కుమార్, కె.నాగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలి పా రు. గడిచిన వారంలో సైబర్ కార్యాలయానికి 8 ఫి ర్యాదులు అందినట్లుగా పేర్కొన్నారు. సైబర్‌మోసా నికి గురైన వెంటనే బాధితులు 1930 నంబర్‌లో లేదా సైబర్‌క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నా రు. గంటలోపు ఫిర్యాదు చేస్తే పూర్తి న్యాయం జరిగే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.


