బాలికల ఆరోగ్య రక్షణకు ‘హెచ్‌పీవీ’ | - | Sakshi
Sakshi News home page

బాలికల ఆరోగ్య రక్షణకు ‘హెచ్‌పీవీ’

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● రిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ఆదిలాబాద్‌టౌన్‌: బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా ఎంతో కీలకమని కలెక్టర్‌ రాజర్షిషా అన్నా రు. 14–15 ఏళ్ల బాలికలకు ఇవ్వనున్న హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎంపీ గొడం నగేశ్‌తో కలిసి రిమ్స్‌లో ఆదివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. బాలికలు ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ వంటివి రాకుండా నిరోధించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1700 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో రిమ్స్‌లో మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం అధునాతన సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మదర్‌ ఫీడింగ్‌ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా క్యాన్సర్‌ మరణాల రేటు ఎక్కువగా ఉందని, ముందస్తుగా వ్యాధి ని గుర్తించడం ద్వారా నివారించవచ్చని పేర్కొన్నా రు. జిల్లా ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వ హిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బండారి అనూష, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, అదనపు డీఎంహెచ్‌వో సాధన, వార్డు కౌన్సిలర్‌ శ్వేత, డీఐవో డాక్టర్‌ వైసీ శ్రీనివాస్‌, డీటీసీవో సుమలత, ఎన్‌సీడీ పీవో శ్రీధర్‌, ఎన్‌హెచ్‌ఎం డీపీవో జాదవ్‌ దేవిదాస్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం అభినందనీయం

మహిళలు రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. బెస్ట్‌ ఫ్రెండ్‌ సొసైటీ ఆధ్వర్యంలో రిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది నర్సులు రక్తదానం చేశారు. వారిని కలెక్టర్‌తో పాటు ఎంపీ నగేశ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement