విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి

Mar 14 2026 7:39 AM | Updated on Mar 14 2026 7:39 AM

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్‌ డి మాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్‌ ఐటీ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి కారణగాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలన్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్స్‌ జరిగిన విధానంపై రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల ఖర్చులు, అన్ని టెండర్‌ ప్రక్రియ చెల్లించిన బిల్లులపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. నాయకులు మనోజ్‌,అక్షయ్‌, రాకేశ్‌, గౌతం, ప్రసాద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement