ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

Mar 10 2026 7:27 AM | Updated on Mar 10 2026 7:27 AM

● ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. సోమవారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్‌ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్‌ (యు)కు చెందిన గేడం గజానంద్‌ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్‌ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్‌ పంపుసెట్‌ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement