బోథ్: హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అ ధ్యక్షుడు గుంజాల భాస్కర్‌రెడ్డి కోరారు. బోథ్‌లో మంగళవారం ఉద్యమకారులతో కలిసి ఆయన మా ట్లాడారు. హైకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లో నెలనెలా రూ.25 వే ల పెన్షన్, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరా రు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లిన అడ్వకేట్ కరుణాకర్‌రెడ్డి, తీర్పు వెల్లడించిన జడ్జి విజయసేనారె డ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌రా వు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే ఉద్యమకారుల కమి షన్ ఏర్పాటు చేసి డిమాండ్లు పరిశీలించాలని భా స్కర్‌రెడ్డి కోరారు. ఉద్యమకారులు, ఉద్యమంలో కీ లక పాత్ర పోషించిన విలేకరులకు నెలనెలా రూ.25 వేల పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఐదెకరాల భూమి, పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, బీమా కల్పించాలని కోరారు. తెలంగా ణ ఉద్యమకారులు కుంట వెంకటరమణగౌడ్, దీటీ దేవిదాస్, వెంకటరమణ, ప్రకాశ్‌సింగ్, మల్లెపూల సుభాష్, అమర్‌సింగ్ భీమ్‌రావ్ తదితరులున్నారు.


