కై లాస్‌నగర్: వేసవి దృష్ట్యా ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అన్నా రు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆమె లాండసాంగ్వి పంప్‌హౌస్‌ను బుధవారం సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న 500 కేవీ ట్రాన్స్‌పార్మర్ మరమ్మతు పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణానికి అన్ని వనరుల నుంచి 30 ఎంఎల్‌డీ నీరు అందాల్సి ఉండగా కేవలం 50 శాతం మాత్రమే అందుతుందన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా కుళాయిలకు ఆనాఫ్ బటన్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంజయ్‌నగర్‌లో రైల్వేఫ్లైఓవర్ పనుల కారణంగా పైప్‌లైన్‌ను తొలగించడం జరిగిందని, యుద్ధప్రతిపాదికన ఆ మరమ్మతు పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కోరినట్లుగా తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్లు సాయి చరణ్‌గౌడ్, సంజయ్, సతీశ్ తదితరులున్నారు.


