ఆదిలాబాద్: అంగన్‌వాడీల సమస్యలను అ సెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిలారు రాధ, పుప్పాల సునంద కోరా రు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ టీచర్లుగా గుర్తించి, కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చే శారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌గా టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్షతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రధాన అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి తమకు న్యాయం చేయాలని కోరారు.


