‘ప్రగతి’ బాటలో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి’ బాటలో కలెక్టర్‌

Mar 10 2026 7:26 AM | Updated on Mar 10 2026 7:26 AM

● కలెక్టరేట్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, ఫైళ్ల క్లియరెన్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

కై లాస్‌నగర్‌: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్ర జ లకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కా ర్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ లో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషతో కలిసి ప్రాంగణంలో చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. డీసీవో కార్యాలయంలో పరిసరాలు, సీపీవో కార్యాలయంలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెజరీ కార్యాలయంలో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోవడంపై ప్రశ్నించారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, పెండింగ్‌ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల్లో పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. వారి వెంట ఆర్డీవో స్రవంతి, కమిషనర్‌ జి.రాజు, కౌన్సిలర్‌ స్వాతి, ప లు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

ఇచ్చోడ: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అ న్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సోమవా రం నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఇందులో డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్‌, ఇచ్చోడ వైద్యాధికారి మధురిమ, రిమ్స్‌ వైద్యులు ఉన్నారు.

అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌

మండల పరిషత్‌ కార్యాలయంలో చేపడుతున్న ప్ర జావాణిలో కలెక్టర్‌ పాల్గొని ప్రజలనుంచి దరఖాస్తు లు స్వీకరించారు. ఇందులో తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖా న్‌,ఎంపీడీవో రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement