చెన్నూర్: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ధారావత్ ధనుష్ ప్రతిభ కనబర్చాడు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎన్9 బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్–2025 బ్యాడ్మింటన్ పోటీల్లో రెండు పతకాలు సాధించాడు. ధనుష్..సింగరేణి ఎస్టీపీపీలో డీజీఎం (ఈఅండ్‌ఎం) ధారావత్ దంపతుల కుమారు డు. ఏప్రిల్ 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాడు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ యాకుబ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్‌లు అతన్ని అభినందించారు.


