అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Mar 10 2026 7:26 AM | Updated on Mar 10 2026 7:26 AM

● త్వరితగతిన పరిష్కరించాలి ● అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ ● గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ

కై లాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దని, ప్రతీ దరఖాస్తును త్వరితగతిన పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌. రాజేశ్వర్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వారం 71 అర్జీలు అందగా ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూసమస్యలు ఉన్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే ..

అధికారుల తీరుపై ఆగ్రహం

పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌కు ప్రతి అధికారి విధిగా హాజరుకావాలని పదేపదే చెబుతున్నా కొంతమందిలో మార్పు రావడం లేదని సీరియస్‌ అయ్యారు. తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement