‘ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట దగా’
ఆదిలాబాద్‌టౌన్: ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలను వంచిస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం హెలిక్యాప్టర్‌లో రావడంలో ఆంతర్యమేమిటని, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైందని ప్రశ్నించారు. భూమాఫియాను పరోక్షంగా ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని, ఆ ప్రాంతంలో 150ఎకరాలు ఎమ్మెల్యే బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారని, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కూడా జిల్లాలో భూములు కొన్నారని ఆరోపించారు. ఈడీ అటాచ్డ్‌లో ఉన్న భూములను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్లు విమర్శించారు. ఎయిర్‌పోర్టు పేరిట ప్రజల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని, ఇది జనాలకు అర్థమైనట్లు చెప్పారు. భోరజ్ తహసీల్దార్ బీజేపీ ఏజెంట్‌గా, కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, ఇజ్జగిరి నారాయణ, దాసరి రమేశ్, సతీశ్, యాసం నర్సింగ్‌రావు తదితరులున్నారు.


