బాసర: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా గుర్తింపు పొందిన అంతఃప్రజ్ఞ 2కే–26 బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌ను గేమింగ్ అరేనాగా మార్చి, ఏఆర్/వీఆర్ సిమ్యులేషన్లు, డ్రోన్ ఆధారిత గేమ్‌లు, వీడియో గేమింగ్ సెటప్‌లు ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సృజనాత్మక స్టాళ్లు క్యాంపస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా మారింది. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, కాకతీయ శాండ్ బాక్స్ ప్రతినిధి సత్యం కె.చౌబే, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


