ఆదిలాబాద్‌టౌన్: సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. రిమ్స్ నర్సింగ్ కళాశాలలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గెజిటెడ్ అధి కారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుకోవాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా క్షయ నివారణ అధికారి సుమలత, సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి రమణాచారి, టీజీవో ఉపాధ్యక్షుడు వామన్‌రావు, కృష్ణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సంఘం నాయకులు శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


