ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కారం

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు జ్యోతి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మార్చి నెలను వేడుకగా కాకుండా పోరాట మా సంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మ హిళలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించా రు. కార్యక్రమంలో మావల ఎంఈవో సరోజ, జీసీడీవో ప్రత్యూష, కవైత్రి శైలజ, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోతె శ్రీనివాస్‌, బి.వృకోధర్‌, రామేశ్వర్‌, జ్ఞానేశ్వర్‌, సాయికాంత్‌, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement