మంచిర్యాలఅర్బన్: సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో 18 మండలాల నుంచి ఎంపిక చేసిన 20 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు డ్రగ్స్ అరికట్టడం, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్‌లకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైకియాట్రిస్ట్ వైద్యుడు రామ్‌నాయక్, పోలీస్ విభాగం నుంచి ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, రిసోర్స్‌పర్సన్లు కృష్ణారెడ్డి, ముజీర్, సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ అధికారి చౌదరి, సైన్స్ అధికారి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


