చెక్‌బౌన్స్‌ కేసులో ఇద్దరికి జైలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌బౌన్స్‌ కేసులో ఇద్దరికి జైలు

Mar 14 2026 7:39 AM | Updated on Mar 14 2026 7:39 AM

మంచిర్యాలక్రైం: చెక్‌బౌన్స్‌ కేసులో ఇద్దరికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మంచిర్యాల జిల్లా జ్యూడిషీయల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.నిరోషా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం క్యాతన్‌పల్లికి చెందిన అశోక్‌కుమార్‌ లడ్డా వద్ద ఆర్థిక అవసరాల నిమిత్తం మంచిర్యాల సీసీసీ కార్నర్‌కు చెందిన నేరెళ్ల రమేశ్‌ 2018లో రూ.5.77 లక్షలు, సీసీసీకి చెందిన నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు వేర్వేరుగా 2018లో కోర్టును ఆశ్రయించాడు. జడ్జి.. ఈ కేసును విచారిస్తున్న సమయంలో అప్పు తిరిగి చెల్లించడంతోపాటు నేరెళ్ల రమేశ్‌కు సంవత్సర కాలం పాటు జైలుశిక్ష, నేరెళ్ల సాయికృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.

క్యాతనపల్లి అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్‌

రామకష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఐదుగురికి శుక్రవారం మంచిర్యాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రామిడికుమార్‌, మేడిపెల్లి సంపత్‌, బండారి సూరిబాబు, కుర్మ దినేష్‌, ముస్తఫాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం బెయిల్‌ మంజూరు చేయడంతో రాత్రి విడుదలయ్యారు.

‘అక్రమ కేసులతో వేధిస్తున్నారు’

మంచిర్యాలటౌన్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనపై అక్రమ కేసులను పెట్టి వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోగుల రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంచిర్యాలలో తనపై ఇప్పటికే 30కి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారని, ఇంకా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీ ఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు భయాందోళన చెందా ల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్‌ పేర్కొన్నారని రవీందర్‌రెడ్డి తెలిపారు.

బెదిరింపులకు పాల్పడిన నలుగురి అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన సలాం వరుణ్‌, దుర్గానగర్‌కు చెందిన వెట్టి మనోజ్‌, ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్రం ప్రభాత్‌రావు, బజార్‌హత్నూర్‌కు చెందిన దుర్వ సుభాష్‌ ఆర్‌కే కోఆపరేటీవ్‌ సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని సొసైటీ చైర్మన్‌ కొండూర్‌ రాకేందర్‌ అడిగితే తుడుందెబ్బ పేరుతో బెదిరింపులకు దిగారు. సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్న ప్రభాత్‌రావు, దుర్వ సుభాష్‌లు తిరిగి ఇవ్వకుండా వెట్టి మనోజ్‌, సలాం వరుణ్‌లు ఆదివాసీ నాయకులమని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాకేందర్‌ నుంచి రెండు, మూడు విడతల్లో ఒక్కోసారి రూ.20వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

సెక్యూరిటీగార్డుపై దాడిచేసిన ఇద్దరిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: వసుంధర షాపింగ్‌ మాల్‌ సెక్యూరిటీ గా ర్డుపై దాడిచేసిన ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సు నీల్‌కుమార్‌ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన నిందితులు షేక్‌ సమీర్‌, సాబిల్‌లు గురువారం పార్కింగ్‌ విషయంలో గొడవపడి సెక్యూరిటీ గార్డు రాథోడ్‌ రవిపై దాడికి దిగారు. బాధితుడు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement