ప్రస్తుతం జిల్లాలో భిన్న వాతావరణం ఉంది. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ కారణంగా దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. బయటకు వెళ్లే వారు ఎక్కువగా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. – ఆడె విఠల్, రిమ్స్ వైద్యులు


