ఆదిలాబాద్‌టౌన్: పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవా రం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్పందన లభించింది. 67 కంపెనీల్లో ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, నాన్ ఐటీ, ఆటోమొబైల్, నర్సింగ్, మార్కెటింగ్, డ్రైవింగ్, సెక్యూరిటీ, టెక్నికల్, ఫార్మ, హెచ్‌ఆర్, ఎయిర్ పోర్ట్ తదితర రంగాల్లో 4వేల ఉద్యోగాల కల్పనకు మేళా నిర్వహించగా 7,500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 67 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 2,100 మంది అర్హులను ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి జిల్లా జడ్జి ప్రభాకరరావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్ నియామకపత్రాలు అందజేశారు. రూ.13వేల నుంచి రూ.40వేల వరకు వేతనం అందనుండగా ఉద్యోగాలకు ఎంపికై నవారు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, జాబ్ మేళాతో పోలీస్ పరేడ్ మైదానం కిక్కిరిసిపోయింది. అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఏఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్, శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్, వన్‌టౌన్, టూ టౌన్ సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


