గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

Mar 19 2026 7:47 AM | Updated on Mar 19 2026 7:47 AM

కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌టౌన్‌: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ గార్డెన్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్య తపై సర్పంచులు, కౌన్సిలర్లు, విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలు, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతీ గురువారం ఆరోగ్య పాఠశాలలో భాగంగా యాంటీ డ్రగ్స్‌డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. గంజాయి సాగు చేస్తే పదేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్టు ధరించాలని, మద్యం సేవించి నడపొద్దని సూచించారు. మహిళల భద్రత కోసం, బాల్య వివాహాలు అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. గడిచిన మూడు నెలల్లో 25 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ప్రతి జ్ఞ చేశారు. కార్యక్రమంలో ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ పి.సీతారాం, అదనపు ఎస్పీ పి.కృష్ణమూర్తి, సీఐ పి.ప్రకాశ్‌రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీలు బి.సురేందర్‌ రావు, పి.మౌనిక, ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, విజేందర్‌, పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మహమ్మద్‌ రోహిత్‌, డౌవ్‌ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement