ఆదిలాబాద్‌టౌన్: వైద్యారోగ్య శాఖలో ఏడుగు రు కార్యాలయ సూపరింటెండెంట్లకు అడ్మిని స్ట్రేటీవ్ ఆఫీసర్ (ఏవో)గా పదోన్నతి లభించింది. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామి లీ వెల్ఫేర్ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గుజరాతి గోపికి రిమ్స్ ఆస్పత్రిలో ఏవో గా పదోన్నతి కల్పించారు. అలాగే రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎ.మహేందర్‌కు రిమ్స్ మెడికల్ కళాశాలలో, రిమ్స్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టి.గోపికి రిమ్స్ న ర్సింగ్ కళాశాలలో ఏవోగా పదోన్నతి లభించింది. నిర్మల్‌లోని మెడికల్ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కె.రవీందర్‌కు ఆదిలా బాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో ఏవోగా, ఆది లాబాద్ నర్సింగ్ కళాశాలలో సూ పరింటెండెంట్‌గా పనిచేస్తున్న సందీప్‌కు నిర్మల్ జీజీహెచ్ ఏవోగా, డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సి. మధుసూదన్ ను నిర్మల్‌కు కేటాయించారు. వీరి కి పదోన్నతి లభించడంపై కార్యాలయ ఉద్యోగులు, అధికా రులు అభినందనలు తెలిపారు.


