ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ శాఖ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సంస్కరణలు చేపడుతోంది. ఫిర్యాదుదారులకు సులభంగా, నాణ్యమైన సేవలు అందేలా రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై పలు కేసుల్లో స్టేషన్‌కు వెళ్లకుండానే సంఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ పక్కాగా అమలు చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే..
ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానం ద్వారా బాధితుల వద్ద కే పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులు సమాచారం ఇచ్చినా, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసినా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలకు సంబంధించి గాయాలైతే బాధితులను ఆస్పత్రికి తరలిస్తారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యభర్తల పంచాయతీలు, వేధింపులు, అనుమానాస్పద మృతి వంటి వాటిపై అప్పటికప్పుడే కేసులు నమోదు చేస్తారు. జిల్లాలో గత 15 రోజులుగా కార్యక్రమం అమలు కాగా, ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్..
నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఈ క్రమంలో వారిని తిరిగి పీఎస్‌కు పిలిచి సమయం వృథా చేయకుండా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే స్పాట్ వద్దకు చేరుకునే పో లీసులు పీఎస్‌లో ఉండే సిబ్బందికి దీనిపై సమాచారం అందిస్తారు. ఘటనా స్థలంలో సేకరించిన వివరాలను ఎస్‌హెచ్‌వో ద్రువీకరించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ చేసి, ఆ తర్వాత బాధితులకు వాట్సాప్ లో పంపిస్తారు. దర్యాప్తులో పురోగతి ఆఽ దారంగా ఫిర్యాదుదారులకు సమాచారం అంది స్తారు. బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా చర్యలు చేపడుతారు. ముఖ్యంగా మహిళలకు ఈ విధానం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమైనప్పుడు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ కార్యక్రమం ద్వారా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ కేసుల వివరాలు..
స్టేషన్ నమోదైన
ఎఫ్‌ఐఆర్‌లు
ఆదిలాబాద్ వన్‌టౌన్ 03
ఆదిలాబాద్ టూటౌన్ 01ఆదిలాబాద్‌రూరల్ 02
తలమడుగు 03
మావల 01
బేల 01
భీంపూర్ 01
బోథ్ 02
బజార్‌హత్నూర్ 01
మొత్తం 15
ఘటనా స్థలానికే పోలీసులు
బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో భాగంగా డీజీపీ ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌ను అమలులోకి తీసుకొచ్చారు. బాధితులు డయల్ 100, స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. వాంగ్మూలం రికార్డు చేయడం జరుగుతుంది. దీంతో బాధితులకు సమయం ఆదా అవుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేశాం.
– ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ


