రంజన్లకు గిరాకీ బానే ఉంటుంది. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఎంత శ్రమించినా తక్కువ లాభానికి అమ్ముకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ రంజన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే మాలాంటి వారికి మేలు చేకూరుతుంది. – రాధారపు సంగీత,
కుమ్మరివాడ, ఆదిలాబాద్
పింఛన్ సౌకర్యం కల్పించాలి
చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నా. తయా రు నుంచి మొదలుకొని, అమ్మే వరకు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. ఆర్థికంగా సమస్యలు అనేకం. వీటన్నింటినీ దాటి వృత్తిని కాపాడుకుంటూ, రంజన్ల తయారీ, అమ్మకాలు కొనసాగిస్తున్నాం. మాలాంటి వృద్ధులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి.
– ఎన్. గంగారాం,
బంగారిగూడ, ఆదిలాబాద్


