అధ్యక్షా.. నిధులు మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

అధ్యక్షా.. నిధులు మంజూరు చేయండి

Mar 19 2026 7:47 AM | Updated on Mar 19 2026 7:47 AM

● అసెంబ్లీలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

● అసెంబ్లీలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

ఇచ్చోడ :బోథ్‌ నియోజకవర్గ అభి వృద్ధికి ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ స్పీకర్‌ ద్వారా అసెంబ్లీలో కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా పలు సమస్యలను బుధవారం సభ దృష్టికి తీసుకెళ్లారు. దేగామ ప్రాజెక్టులో భాగంగా పెండింగ్‌లో ఉన్న 200 కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. బోథ్‌లో ఫైర్‌స్టేషన్‌ లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను వివరించి వెంటనే మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని, ఆసుపత్రి భవన నిర్మాణ బిల్లులందక పనులు నిలిచిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బోథ్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఇచ్చోడలో షాదీఖానా నిర్మాణానికి రూ.3 కోట్ల ఫైనాన్స్‌ అనుమతి ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో పత్తి, సోయా పంటలు పండిస్తున్న రైతులకు బోనస్‌ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement