షడ్రుచుల పండుగ వచ్చేసింది. నేటి నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం షురూ కానుంది. ఉగాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. రైతులు తమ పొలాలకు వేకువజా మున వెళ్లి ప్రత్యేక పూజలతో పాటు ఆరుకోవడం ఆనవా యితీ. ప్రతీ ఇంటా షడ్రుచుల పచ్చడితో పాటు భక్షాలను స్వీకరిస్తారు. సనాతన హిందూ ఉత్సవ సమితితో పాటు రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉదయం ఉగాది పచ్చడితో పాటు గుడాలు పంపిణీ చేపట్టనున్నారు. సాయంత్రం గోపాలకృష్ణ మఠంతో పాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నా రు. ఈమేరకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. – ఆదిలాబాద్


