ఈ సంవత్సరం నవనాయకులలో ఏడు శుభ గ్రహాలే ఉన్నాయి. ఇది దేశానికి, ప్రజలకు ఎంతో శుభసూచకం. రాజా, నీరసాధిపతి గురుడు కావడం వల్ల ప్రభుత్వ పాలన ప్రజా రంజకంగా ఉంటుంది. అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. మంత్రి కుజుడు కావడం వల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఐటీ రంగా లు అద్భుతమైన వృద్ధిని సాధిస్తాయి. భూముల ధరలు పెరుగుతాయి. నాలుగు కుంచాల వర్షం వల్ల జలాశయాలు నిండుతాయి. వరి, పత్తి, మిర్చి, వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తా యి. శత్రువుల పన్నాగాలను మన సైన్యం తిప్పికొడుతుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ విజయం మనదే అవుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉంది. వేసవిలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
– శివశ్రీ సాయికుమార్, వేద పండితులు, ఆదిలాబాద్


