ఉట్నూర్‌రూరల్: ఇంటి ముందు నిలబడి ఉన్న యువకుడిపై అడవిపంది దాడి చేసిన ఘటన బుధవారం మండలంలోని హస్నాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రవీణ్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా పంట పొలాల నుంచి వచ్చిన అడవిపంది దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో కు టుంబ సభ్యులు వచ్చే సరికి అక్కడి నుంచి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. జనావాసాల్లో అడవిపంది వచ్చి దాడులు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జ నావాసాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారుల త గు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


