తలమడుగు: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో రూ.1.01కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, దేశంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన పథకం చేపట్టిందన్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, సర్పంచ్‌లు భీంరావు, సంతోష్, నాయకులు గంగాధర్‌రావు, చంద్రకాంత్, డీఈ రాజేశ్వర్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.


