ఆదిలాబాద్‌రూరల్: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు, జడ్జి జబేజ్ శామ్యూల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని చాందా (టి) పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లలో జిల్లాలో 1,600 కేసులు పరిష్కరించామన్నారు. వినియోగదారులు తమ సమస్యలపై సరైన ఆధారాలతో కమిషన్ కార్యాలయాన్ని సంప్రదిస్తే అక్కడ ఉన్న సిబ్బంది సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. కార్యక్రమంలో వినియోగదారులు పాల్గొన్నారు.


