● పట్టణానికి జీవనదిగా భావించే లాండసాంగ్వి పంప్‌హౌస్ వద్ద పైపులకు నీరు పుష్కలంగా సరఫరా అయ్యేలా వాగులో నీటి ప్రవాహన్ని నిలిపి ఉంచేలా చర్యలు చేపట్టనున్నారు. వాగులో ఇసుక బస్తాలతో కూడిన ప్రత్యేక కట్టను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం రూ.1.50లక్షలు కేటాయించారు.
● పట్టణంలో పాడైన చేతిపంపులు, పవర్ బోర్‌వెల్స్ బాగు చేసేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుతో పాటు నీటి సమస్య తలెత్తే ఆ యా కాలనీల్లో కొత్తగా బోరుబావులు తవ్వించేందు కోసం రూ.25లక్షలు కేటాయించారు.
● మిషన్ భగీరథ నీరు సరఫరా కాని విలీన కాలనీలు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. ప్ర స్తుతం ఉన్న బల్దియా ట్యాంకర్లతో పాటు అదనంగా మరో ఆరు అద్దెకు తీసుకోనున్నారు. ఇందుకోసం రూ.10లక్షలు కేటాయించారు.
● లాంగసాంగ్వి పంప్‌హౌస్ వద్ద గల పైపుల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు గాను రూ.12లక్షలు కేటాయించారు.
● పట్టణంలో నీరు అడుగంటిన చేతిపంపులు, బోర్‌వెల్స్‌లో అదనపు పైపులు వేసేందుకు మరో రూ.5లక్షలు కేటాయించారు.
● ఫిల్టర్‌బెడ్‌లో నీటి శుద్ధి, పట్టణానికి సరఫరా చేసే నీటిలో కలిపేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకు రూ.15లక్షలు కేటాయించారు.
● మున్సిపల్ కార్యాలయం సంప్ వద్ద ఉన్న 60హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన మోటర్లు, లాంగసాంగ్వి పంప్‌హౌస్ వద్ద 125 హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన మోటర్ల మరమ్మతుకు రూ.2.50లక్షలు కేటాయించారు. అలాగే కల్వ ర్టుల వద్ద చెడిపోయే పైపుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా కొనుగో లు చేసేందుకు రూ.5లక్షలు కేటాయించారు.
సిద్ధం చేసిన బల్దియా నీటి ఎద్దడి నియంత్రణకు రూ.76లక్షలు కేటాయింపు టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేలా ముందస్తు చర్యలు
కై లాస్‌నగర్: ఈ వేసవిలో జిల్లాకేంద్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గత అనుభవాల దృష్ట్యా కసరత్తు చేసిన ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రత్యేకంగా రూ.76లక్షలు కేటాయించారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానిస్తూ ఆమోదించారు. ఈమేరకు టెండర్ల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 17న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వారం పాటు ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించనున్నారు.
పనుల వారీగా కేటాయింపులు ఇలా..
తాగునీటికి ఇబ్బంది రానివ్వం
ఈ వేసవిలో పట్టణ పరిధిలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ల ద్వారా ఆయా పనులు చేయిస్తాం. మావల చెరువుతో పాటు లాంగసాంగ్వి నుంచి పూర్తిస్థాయిలో నీరు సరఫరా అవుతుంది. గ్రిడ్ నుంచి కూడా 16 ఎంఎల్‌డీలు అందుతుంది.
– అరుణ్‌కుమార్, మున్సిపల్ ఇంజినీర్