ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివాసీ పర్ధాన్ సమాజ్ గోండి ధర్మ గురు హీరా సుకా జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆది వారం నిర్వహించారు. రాంలీలా మైదానంలో అధి కారికంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ముందుగా బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో కలెక్టర్ పాల్గొని సంప్రదాయ పూజలు చేపట్టారు. ఆది వాసీలతో కలిసి థింసా నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలన్నారు. జల్, జంగల్, జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ, ఆదివాసీ పర్ధాన్ కులస్తుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పర్ధాన్ కులస్తుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, పర్ధాన్ కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అనంతరం పర్ధాన్ కులస్తుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వేడుకల కమిటీ అధ్యక్షుడు మెస్రం శంకర్, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, సమాజ్ నాయకులు డాక్టర్ మెస్రం మనోహార్, గేడం తులసీరాం, మడావి శంకర్, మెస్రం శంకర్, కుర్సేంగే తానాజీ, గేడం నిరంజన్, పూసం ఆనంద్‌రావ్, ఉయిక సుదర్శన్, మెస్రం కేశవ్, మెస్రం నాగేశ్వర్‌రావ్, దుర్వ నగేశ్, సిడాం రాంకిషన్, సిడాం భీంరావ్, ఉయిక విఠల్, మెస్రం మారుతి, గేడం ప్రకాశ్, కుమ్ర సంగీత, మెస్రం సంగీత, గేడం వనిత, గోవింద్ రావ్, కుమ్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.


