ఆదిలాబాద్: ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామిజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని మఠంలో మంగళవారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. గోపాలకృష్ణ మఠంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, గుడాల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ పంచాంగకర్త చికిలి వెంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్య లో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, రవీందర్, నర్సిములు, రవీందర్, దశరత్, రాజు, సుభాష్, మహిపాల్, రాజు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


