కై లాస్‌నగర్: బోథ్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం నిర్వహంచిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడె గజేందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వారికి కండువా కప్పి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో చిలుకూరి భూమయ్య, ఆత్రం నాగో రావు, చాకటి మహేశ్, గడ్డం కాశీనాథ్, విజేందర్, వెంకటరమణ, రమేశ్, గణేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నాయకులు తుల అరుణ్‌కుమార్ తదితరులున్నారు.


