ఎస్పీ అఖిల్ మహాజన్
కై లాస్‌నగర్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో అర్జీలు వెల్లువెత్తాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి తదితర సమస్యలపై ఈ వారం మొత్తం 85 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిణి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.


