విద్యుత్‌ వైరు దొంగలపాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వైరు దొంగలపాలు

Mar 18 2026 8:10 AM | Updated on Mar 18 2026 8:10 AM

● పట్టించుకోని అధికారులు ● ఖాళీగా దర్శనమిస్తున్న స్తంభాలు

కోటపల్లి: మిషన్‌ భగీరథ నీటిని అందించేందుకు గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యుత్‌లైను ఏర్పాటు చేయగా అధికారుల నిర్లక్ష్యంతో తీగలు చోరీకి గురవుతున్నాయి. వేమనపల్లి మండలం ముల్కల్లపేట నుంచి జనగామ వరకు మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి నీటిని అందించేందుకు గత ప్రభుత్వం జనగామ వద్ద ట్యాంక్‌లను ఏర్పాటు చేసి మోటార్ల సహాయంతో సమీప గ్రామాలకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జనగామ నుంచి ముల్కల్లపేట వరకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేశారు. అధికారుల పట్టింపులేమితో దుండగులు విద్యుత్‌ వైరును కట్‌ చేసుకుని వెళ్తుండడంతో ముల్కల్లపేట నుంచి సుపాక వరకు ఖాళీ స్తంభాలు దర్శనమిస్తున్నాయి. విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే రెచ్చిపోయిన దుండగలు దాదాపు 5 కిలోమీటర్ల మేర విద్యుత్‌ వైరును కత్తిరించుకు వెళ్లారు. ఈ విషయమై ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా విద్యుత్‌ వైరు చోరీకి గురైంది నిజమేనని, మరుసటి రోజే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుండగులను వెంటనే పట్టుకుని విద్యుత్‌ లైన్‌ పునరుద్ధరణ జరిగేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement