తాంసి/తలమడుగు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసి, తలమడుగు మండలకేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో ఎస్‌బీఐ, మిత్ర ఎన్జీవో సహకారంతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను మంగళవారం ప్రారంభించారు. తాంసి పీహెచ్‌సీలో మరుగుదొడ్డి అస్తవ్యస్తంగా ఉండటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఎస్‌బీఐ ఆర్‌ఎం రాంచంద్రరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, మైత్రి హలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, తహసీల్దార్‌లు లక్ష్మి, రాజ్ మోహన్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, వైద్యాధికారులు శ్రావ్య, నర్మద, హరీష్, శ్రీధర్, ఏఈ నజీర్, సర్పంచ్ సంతోష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం తలమడుగులోని పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంతో పాటు పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, వైద్యులు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఖోడద్ గ్రామంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, గ్రామ ఉద్యోగుల సంఘం సభ్యులు వెంకట్, నర్సింలు, చంద్రారెడ్డి, అనిల్‌రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.


