కై లాస్‌నగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం 48గంటల నిరసన దీక్ష చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆశాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ.18 వేల కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఆఽశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


