చెట్లను నరికేసిన అనంతరం
పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న కంచె
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల ఎన్టీఆర్ చౌక్ నుంచి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రీన్‌బెల్టును అభివృద్ధి చేసింది. కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం మొక్కలను కొట్టేసి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద గల ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు పార్కింగ్ స్థలం కోసం పచ్చని చెట్లను కొట్టేసి ప్రత్యేక కంచెను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిన బల్దియా అధికారులు మామూలుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్


