ఆర్‌యూబీ, ఆర్‌వోబీ పనుల నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సుమారు రూ.కోటి వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వేర్వేరుగా నివేదించిన గ్రిడ్, బల్దియా అధికారులు
ఈ విషయమై మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) ఎస్‌ఈ శ్రావణ్ కుమార్‌ను సంప్రదించగా గ్రిడ్ పైపులైన్లను మా ర్చేందుకు రూ.42లక్షలతో కూడిన ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపించినట్లుగా తెలిపారు.
మున్సిపల్ ఇంజనీర్ ఆరుణ్‌కుమార్‌ను సంప్రదించగా.. ఆర్‌యూబీ, ఆర్‌వోబీ ల వద్ద భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పైపులైన్ల ను పూర్తగా పక్కకు షిష్ట్ చేసేందుకు రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించినట్లు తెలిపారు.
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల వద్ద గల మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మార్చేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కొత్త నిర్మాణాలు పూర్తయితే అడుగుభాగంలో ఉన్న పైపులైన్‌లో తలెత్తే లీకేజీలకు మరమ్మతులు చేయడం కష్టతరంగా మారనుంది. దీనిని గుర్తించిన వాటర్‌గ్రిడ్, మున్సిపల్ అధికారులు పైపులైన్లను పక్కకు మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా శాఖలు రూ.కోటి 2లక్షల వ్యయంతో వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేలోగా అనుమతి తీసుకువచ్చి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
సమస్య ఉత్పన్నం కాకుండా..
నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం మాటేగాం వద్ద గల పంప్‌హౌస్ నుంచి ఆదిలాబాద్ ఫిల్టర్‌బెడ్‌కు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుంది. ఇటీవల రైల్వే ఓవర్ బ్రిడ్జి పిల్లర్ కోసం తవ్వకాలు చేపట్టగా స్థానిక సంజయ్‌నగర్ కాలనీ వద్ద గల ప్రధాన పైపులైన్ ఽస్వల్పంగా దెబ్బతింది. దీంతో అధికారులు మూడు రోజులు శ్రమించి మరమ్మతులు చేపట్టారు. చిన్నపాటి సమస్యకే ఇంత ఇబ్బంది ఏర్పడగా బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా వాటి కింద వెళ్లే పైపులైన్ల పరిస్థితి ఏంటనే దానిపై మున్సిపల్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు పరిశీలన చేపట్టారు. నిర్మాణాలు పూర్తయితే పైపులైన్ పూర్తిగా అడుగుభాగంలో ఉంటుంది. బ్రిడ్జి నుంచి వెళ్లే వాహనాల వేగానికి పైపులు కదలి లింకుల్లో గ్యాప్ తలెత్తే అవకాశముంటుందని భావించారు. అదే జరిగితే ఫిల్లర్ల వద్ద మరమ్మతులు చేయడానికి ఆస్కారముండకపోవచ్చని నిర్ధారించారు. ఈమేరకు పైపులైన్లను పూర్తిగా బ్రిడ్జిల పక్కకు మార్చాలని నిర్ణయించారు.
రూ.1.02 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు ..


