ఉట్నూర్‌రూరల్: ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ–ఆఫీస్ వినియోగించడం ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ–ఆఫీస్ ద్వారా కార్యాలయ ఫైళ్లను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాలయ పనితీరు మెరుగుపడుతుందన్నారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులు, సిబ్బంది ఈ–ఆఫీస్ వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు.


