● ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో.. ● రోడ్లు, కల్వర్టులు నిర్మించాలంటున్న ప్రజాప్రతినిధులు ● ప్రభుత్వానికి నివేదిస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో.. ● రోడ్లు, కల్వర్టులు నిర్మించాలంటున్న ప్రజాప్రతినిధులు ● ప్రభుత్వానికి నివేదిస్తున్న అధికారులు

Mar 18 2026 8:09 AM | Updated on Mar 18 2026 8:09 AM

● ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో.. ● రోడ్లు, కల్వర్టులు నిర్మించాలంటున్న ప్రజాప్రతినిధులు ● ప్రభుత్వానికి నివేదిస్తున్న అధికారులు

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 99 రోజుల పాటు జూన్‌ 12 వరకు 10 ప్రధాన అంశాలతో నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారంతో పాటు ఇతర అంశాలను ఇందులో పొందుపరిచారు. తక్కువ అంచనా వ్యయంతో పూర్తయ్యే పనులకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, పట్టణంలోని వార్డులకు సంబంధించి రూ.10వేలు, మండలం, మున్సిపాలిటీలో రూ.రెండు లక్షలు, నియోజకవర్గ స్థాయిలో రూ.10 లక్షలు, జిల్లాస్థాయిలో రూ.50 లక్షలు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఖర్చు చేసిన తర్వాత డీటెయిల్‌ ఓచర్‌ బిల్లు పెట్టుకున్న పక్షంలో ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది.

వ్యయంతో కూడుకున్న ప్రతిపాదనలు..

పారిశుద్ధ్యం, ఆరోగ్యం సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మున్సిపల్‌ వార్డుల్లో, గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు తీష్ట వేసి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు నిర్మించాలని మున్సిపాలిటీతో పాటు జీపీల్లో ప్రతిపాదనలు అందజేస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై న స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి పెద్ద మొత్తం వ్యయంతో కూడుకున్నవి కావడంతో అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపుతున్నారు.

ఇలాంటివి కూడా..

తమ ఇళ్ల ముందు అసౌకర్యంగా ఉన్న చెట్లు, విద్యుత్‌ స్తంభాలు తొలగించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు. సాధారణ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. వాటి పరిష్కారంలో జాప్యం అవుతుండడంతో ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు ఈ సమస్యలను పరిష్కరించాలని జాబితాలు అందజేస్తుండడం గమనార్హం. అదిలాబాద్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద ప్రైవేట్‌ బస్సుల పార్కింగ్‌ను తొలగించాలని స్థానిక ప్రజా ప్రతినిధి అధికారులకు విన్నవించారు. ఇలా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని చిన్న చిన్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. మరి ఇవి పరిష్కారం అవుతాయే లేదో వేచి చూడాల్సిందే.

‘బీటీ రోడ్లు, సీసీరోడ్లు, డ్రైయిన్లు,

కల్వర్టులు, సర్వీస్‌ రోడ్లు నిర్మించాలి.. సీసీ కెమెరాలు బిగించాలి.. వీధి పేరుకు సంబంధించి సైన్‌ బోర్డులు పెట్టాలి.. ఓపెన్‌ జిమ్‌లను రిపేర్‌ చేయించాలి.. కొత్తవి ఏర్పాటు చేయాలి..’ ఆదిలాబాద్‌ పట్టణంలోని 43వ వార్డు కౌన్సిలర్‌ కలాల శ్రీనివాస్‌ మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ జి.రాజుకు అందజేసిన ప్రతిపాదనల జాబితా ఇది. ఈ ఒక్క వార్డు నుంచే కాదు.. మరికొన్ని వార్డుల నుంచి ఇలాంటి ప్రతిపాదనలే అందుతున్నాయని బల్ధియా అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement