బెల్లంపల్లి: పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హో టళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు బెల్లంపల్లి ము న్సిపల్ కమిషనర్ జె.సంపత్ మంగళవారం జరి మానా విధించారు. కాల్‌టెక్స్ ఏరియాలోని అరేబి యన్ క్లాసిక్ నైట్ మండి హౌజ్, అబ్దుల్ రహెమాన్ మండి హౌజ్, పాతబస్టాండ్ ఏరియాలో ఉన్న వినా యక టిఫిన్ సెంటర్, బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించకుండా ఆ హార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించా రు. ఈమేరకు సదరు హోటల్ యాజమానులకు రూ. 20 వేలు జరిమానా విధించారు. పునరావృతమైతే దుకాణాలను స్వాధీనం చేసుకు ని మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు.


