కై లాస్‌నగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 48 గంటల దీక్షను మంగళవారం విరమించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశాలు సమస్యలతో కూడిన వినతిపత్రంను డీఎంహెచ్‌వోకు అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో సీఐటీయూ, ఆఽశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గుట్కా విక్రయాలు అరికట్టాలి
ఆదిలాబాద్: విద్యాసంస్థల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న గుట్కా, సిగరెట్ షాపులు వెంటనే తొలగించాలని ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ నాయకులు కోరారు. ఈమేరకు వన్‌టౌన్, టూటౌన్ సీఐలకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల సమీపంలో గుట్కా, సిగరెట్ షాపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా విద్యార్థులు చిన్న వయసులోనే చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అన్నారు. ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదిత్య, సాయి, అభిచరణ్, హరి, రేవంత్, క్రాంతి, వంశీ తదితరులున్నారు.


